ప్రకృతి త్రయస్వరూపిణి
సాహితీమిత్రులారా!
ఆర్యా శతకంలోని
శబ్దచిత్రం చూడండి-
ప్రకృతి త్రయస్వరూపిణి
సకియ యనం బురుషుడెట్టి జనుడైననుదా
రకళత్రము భార్యగ యో
పికచే దగినట్లు నడుచు వినుమా యార్యా!
ప్రకృతి త్రయస్వరూపిణి - మూడువిధాలైన
ప్రకృతులు అనగా సాత్విక రాజస తామసాలు మూడు గలది.
దార-కళత్రం- భార్య అనే మూడు విధాలైన
పుం, నపుంసక, స్త్రీలింగాలు మూడు గలది.
ఇందులోని శబ్దచమత్కారం-
స్త్రీ మూడు విధాలైన ప్రకృతులు కలది.
కాబట్టి తన భర్త త్రిగుణాలలో ఎలాంటి గుణం
గలవాడైనా అతనికి తగినట్లు నడచుకోగలదు.
దారా అనే శబ్దం పుంలింగం-
పురుషుని భయపెట్టునది, భయపడునది అని వీని అర్థం.
పురుషుడు అపమార్గంలో ఉంటే వాణ్ని భయపెట్టి దారికి
తెచ్చుకుంటుంది. లేదా అనుకూలుడా తానే అతనికి
భయపడుతుంది.
కళత్రం - నపుంసకలింగం.
పురుషుని కళంకంనుండి రక్షించేది.
అతని కళలు కాపాడేది అని అర్థం.
ఇల్లాలు మంచిదైనపుడు తన భర్తకు
ఏమచ్చారాకుండా కాపాడుతుంది.
భార్యా అంటే భరింపబడేది అని అర్థం.
సంసారంలో ఆమె పురుషునిచే భరింపబడుతుంది.
అతడు పెట్టే కష్టాలనన్నిటిని భరిస్తుంది.
ఈ విధంగా ప్రకృతి మూడురకాలు.
No comments:
Post a Comment