నన్దామి మేఘాన్ గగనేऽవలోక్య
సాహితీమిత్రులారా !
ఈ ప్రహేలికను చూడండి-
నన్దామి మేఘాన్ గగనేऽవలోక్య
నృత్యామి గాయామి భవామి తుష్ట:
నాహం కృషిజ్ఞ పధికోऽపినాహం
వదంతు విజ్ఞా మమ నామధేయమ్
ఆకాశంలో మేఘాలను చూస్తే
నా మనసు వికసిస్తుంది.
నాట్యమాడతాను, పాటలుపాడతాను,
ఆనందం కలుగుతుంది.
నేను కృషీవలునికాను
పధికునికాను.
మీకు నాపేరు తెలిస్తే చెప్పండి
రైతు ఆకాశంలో మేఘాలను చూస్తే ఆనందిస్తాడు
ఆడతాడు పాడతాడు.
ఎండతాపానికి అలసిపోయిన ప్రయాణికుడు
మేఘాలను చూచి ఆనందంతో గంతులేస్తాడు
పాటలుపాడతాడు
ఈ శ్లోకం రైతుకాదు ప్రయాణికుడు కాదంటోంది.
దీన్ని బాగా ఆలోచిస్తే
ఈ లక్షణాలు మయూరానికి అంటే
నెమలికి సరిపోతాయి
కావున దానిపేరు - నెమలి(మయూరము)
No comments:
Post a Comment