నేమము నూనినాను
సాహితీమిత్రులారా!
అప్పల విశ్వనాథశర్మగారు రచించిన
శ్రీ శివలింగ విలాసము అనే శతరంలోని
ద్వ్యక్షరి చూడండి-
ఇందులో "న"-"మ"- అనే రెండు హల్లులను
ఉపయోగించి ఉత్పలమాల
కూర్చారు. చూడండి-
నేమము నూనినాను - మునునిన్ను మనమ్మున నమ్మినాను నీ
నామము నెన్ని నేను మననమ్మున నున్న నన్నన మౌనమా
నేమన - నిన్ను మాని నినునేమన - మిన్నుననున్న నామి న
న్నోము మన్నన - మానమున నోమము నెమ్మని చంద్రశేఖరా!
ఓ చంద్రశేఖరా! నీపై విశ్వాసము
ఉంచి నియమముగా నీ నామస్మరణే
చేస్తున్నాను. స్వర్గంలో ఉన్న
ఓ స్వామీ! నన్ను రక్షించు - అని భావం.
దీనిలో మకుటం తప్ప "న"."మ" - అనే రెండు
హల్లులతోటే పద్యం పూర్తి చేయబడింది.
No comments:
Post a Comment