Monday, November 28, 2016

గాలివాన గోవు మేలు గాదె


గాలివాన గోవు మేలు గాదెసాహితీమిత్రులారా!


సమస్య-
గాలివాన గోవు మేలు గాదె

కడిమిళ్ల వరప్రసాదుగారి పూరణ-

గోవునందు సురలు గూడి యుందురుగాన
ఎల్లరకును బాల తల్లిగాన
లోకమందు నిజము రూపింపగా నలు
గాలివాన గోవు మేలు గాదె

దీనిలో కవిగారు గాలివానకు ముందు
నలు చేర్చడంవలన నలుగాలివాన అయింది
నలుగాలివాన - అంటే నాలుగుకాళ్ళుగలవి అన-
జంతువులలో గోవుమేలైనది అనే అర్థంగా మారింది.ఆసక్తిగల మీరునూ మరోరకంగా పూరించి పంపండి.


No comments: