Wednesday, November 23, 2016

పర్వతం మాల్యవంతమ్


పర్వతం మాల్యవంతమ్



సాహితీమిత్రులారా!



వ్యపేత పాదచతుష్ట మధ్యమాంత 
యమకమును గురించి తెలుసుకుందాము-
దీనికి ఉదాహరణ
భట్టికృత రావణవధ కావ్యం నుండి చూడండి-

మిత మవద దుదారం తాం హనూమాన్ముదారం
రఘు వృషభ సకాశం దేవి యామి ప్రకాశమ్
తవ విదితవిషాదో దృష్టకృత్స్నామిషాద:
శ్రియ మనిశ మవంతం పర్వతం మాల్యవంతమ్

(హనుమంతుడు సంతోషంతో వేగముతో మితము
నర్థవంతమునైన యూ వాక్యములను ఆమెకు(సీతకు)చెప్పెను.
ఓ దేవీ! నీ విషాదమును తెలిసికొంటిని. రాక్షసుల నందరను చూచితిని.
ఎల్లపుడును మాంగల్యమును గలిగించు మాల్యవంతముమీదుగా
ప్రకాశముగా రఘువృషభుడయిన రాముని చెంతకు వెళ్ళుదును.)

మిత మవద దుదారం తాం హనూమాన్ముదారం
రఘు వృషభ సకాశం దేవి యామి ప్రకాశమ్
తవ విదితవిషాదో దృష్టకృత్స్నామిషాద:
శ్రియ మనిశ మవంతం పర్వతం మాల్యవంతమ్

దీనిలో
మొదటిపాదం 7,8 అక్షరాలు కలుపగా "దారం" అయినది
అలాగే పాదాంతమున "దారం" అని ఉంది.
రెండవపాదంలో 7,8 అక్షరాలు కలపగా "కాశం" అని అగును
అలాగే పాదాంతమున "కాశం" పునరుక్తమైనది.
మూడవ పాదంలో 7,8 అక్షరాలు కలుపగా "షాద:" అగును
అదే విధంగా పాదాంతమున పునరావృతమైనది.
నాలుగవపాదం 7,8 అక్షరములు కలుపగా "వంతం" అగుచున్నది
అదేవిధంగా పాదాంతమున "వంతం" పునరావృతమైనది
కావున దీనిలో ప్రతీపాదంనందు యమకము వచ్చింది
కాని ప్రతిదానికి మధ్య అంతరము ఉండటం వలన వ్యపేతమగుచున్నది
కావున ఇది వ్యపేత పాదచతుష్ట మధ్యాంతయమకమునకు
ఉదాహరణ అగుచున్నది.

No comments: