తండ్రీ రమ్మని ప్రాణనాథు పిలిచెన్
సాహితీమిత్రులారా!
సమస్య-
తండ్రీ! రమ్మని ప్రాణనాథు బిలిచెన్ దన్వంగి మోహాంధయై
గాడేపల్లి వీర రాఘవశాస్త్రిగారి పూరణ-
మన్మథ బాధతో తపిస్తూన్న కాంత
- ప్రాణనాథుడు కోర్కె తీర్చటానికి రాకపోతే,
తానే పూనుకొని పైబడి ప్రాణనాథుని తీవ్రంగా
పిలుస్తున్న పద్ధతిలో పూరించారు చూడండి-
ఉండ్రానట్టి మనోజ తాపమున ధైర్యోచ్ఛేదమై ప్రేమమున్
గుండ్రాయట్టు లొనర్చి ప్రక్కబడి కోర్కుల్ దీర్చ రానట్టి కో
దండ్రామాభుడు నాథుపై గవసి త్రాతా! రార! బేతాళు పె
త్తండ్రీ! రమ్మని ప్రాణనాథు పిలిచెన్ తన్వంగి మోహాంధయై
మీరునూ మరోరకంగా పూరించి పంపండి.
No comments:
Post a Comment