ఘనగిరీంద్ర విలంఘన శాలినా
సాహితీమిత్రులారా!
వ్యపేత చతుష్టపాద ఆదిమధ్య
యమకమును గురించి తెలుసుకుందాము-
దీనికి ఉదాహరణ
భట్టి కృత రావణవధ కావ్యంనుండి-
ఘనగిరీంద్ర విలంఘన శాలినా
వనగతా వనజద్యుతిలోచనా
జనమతా దదృశే జనకాత్మజా
తరు మృగేణ తరుస్థలశాయినీ
(పద్మముల కాంతివంటి కాంతిగల లోచనములు గలది,
వనమునందున్నదియు, జనముల గౌరవమునకు ఆశ్రయైనదియు,
వృక్షచ్ఛాయయందు పరుండియున్నదియు అయిన జానకిని మహాపర్వతలంఘన స్వభావముగల శాఖామృగమైన హనుంతుడు దర్శించెను.)
ఘనగిరీంద్ర విలంఘన శాలినా
వనగతా వనజద్యుతిలోచనా
జనమతా దదృశే జనకాత్మజా
తరు మృగేణ తరుస్థలశాయినీ
దీనిలో మొదటిపాదం మొదట ఘన - మధ్యలో లంఘన
రెండవపాదం మొదట వన - మధ్యలో వనజ
మూడవపాదం మొదట జన - మధ్యలో జనకా
నాలుగవపాదం మొదట తరు - మధ్యలో తరుస్థల
రావడం జరిగింది.
పాదమునకు మొదట మరియు మధ్య ఒకేవిధమైన
అక్షరగుచ్ఛము నాలుగుపాదములందు ప్రయుక్తమైనది.
అదియు ఒకదానికి మరొకదానికి అంతరము ఉన్నందున
ఇది వ్యపేత చతుష్టపాద ఆదిమధ్య యమకము అగుచున్నది.
No comments:
Post a Comment