Thursday, November 17, 2016

పిపాసిత: కిం ద్వికరేణ పీతే?


పిపాసిత: కిం ద్వికరేణ పీతే?




సాహితీమిత్రులారా!



బిల్హణుడు ఆయన భార్య మాట్లాడుకున్న
శ్లోకాలు ఎంత చమత్కారంగా ఉన్నాయో చూడండి-
ఇది సంవాదచిత్రంగా చెప్పవచ్చు-

రాత్రి మొదటిజాములోనే సురత క్రీడకు
బిల్హణుడు తొందరపడుతున్నాడు.
అప్పుడు
ఆమె ప్రియునితో-

జాగర్తిలోకో - జ్వలతిప్రదీప:
సఖీజనో ద్వీక్షతి కౌతుకేన
ముహూర్తమాత్రం కురుకాంత ధైర్యం
ఋభుక్షిత: కిం ద్వికరేణ భుంక్తే?

(అందరు మెలకువగా ఉన్నారు.
పెద్ద దీపాలు వెలుగుతున్నాయి.
సఖురాండ్రు మనలను గమనిస్తున్నారు.
ఓ మనోహరా ముహూర్తకాలం ధైర్యమవలంబించు
ఎంత ఆకలి వేసినా రెండు చేతులతో తింటారా)

దానికి బిల్హణుని సమాధానం-

జాగర్తిలోకో - జ్వలతిప్రదీప:
సఖీజనో ద్వీక్షతి కౌతుకేన
ముహూర్తమాత్రం కురుకాంత ధైర్యం
పిపాసిత: కిం ద్వికరేణ పీతే?

(అందరూ మెలకువతో ఉండిన ఉండనీ
పెద్దదీపాలు వెలిగితే వెలగనీ
నీచెలికత్తెలు ఉత్సాహంగా చూస్తుంటే చూడనీ
నేనింక ముహూర్తకాలం దైర్యంవహించలేను
దప్పికగొన్నవాడు రెండు చేతులతో త్రాగడా)

No comments: