రావణుడన్న రామునకు
సాహితీమిత్రులారా!
సమస్య-
రావణుడన్న రామునకు, రామునకున్ ఉమ తల్లి కోడలౌ
'శాంతిశ్రీ' బొత్సకవి పూరణ-
భూ వనితా సుతం గొనుచు బోయె నెవండు? బలుండు వాలి సు
గ్రీవున కేమి యౌనొ? వెలిగెం దగ వేరికి? కొండ కూతురే
పావని? పూజ్య యెవ్వతె? ప్రభావతి కృష్ణున కేమి కావలెన్?
రావణు, డన్న, రామునకు రామునకున్, ఉమ, తల్లి, కోడలౌ
ఈ కవి దీన్ని క్రమాలంకారంలో పూరించారు.
దీనిలో 6 ప్రశ్నలు మూడు పాదాలలోను
సమాధానాలు చివరిపాదంలోను రావడం జరిగింది కావున దీన్ని
అంతర్లాపిక అనే ప్రహేళికగా కూడ చెప్పవచ్చు.
ఆసక్తిగల వారు మరోరకంగా పూరించి పంపగలరు
పంపేవిధానం-
మీరు కామెంట్ అనే చోటినుండి పంపాలి.
లేఖిని ద్వారా టైపు చేసి అందులోనుండి
కాపీ చేసి కామెంట్ నందు పేస్ట చేసి పంపవచ్చు.
No comments:
Post a Comment