గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్
సాహితీమిత్రులారా!
సమస్య -
గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్
ఇది భారతంలోని ఒక పద్యపాదం.
మతి దలపగ సంసారం
బతి చంచల మెండమావు లట్టుల సంపత్
ప్రతతు లతి క్షణికంబులు
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వగా దాన్ని
వసంతరావు రామకృష్ణారావుగారు ఇలాపూరించారు
అతి వేగాకుల మగు జీ
వితమున పరిణామ మెపుడు వృద్ధుని చెందున్
క్షితిపై మనుజుల కెప్పుడు
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
జీవితం అతి వేగం వల్ల కల్లోలితమవుతున్నది.
పరిణామం వృద్ధి చెందుతున్నది.
ఎప్పుడైనా జరిగిన రోజులే మంచి మనిపిస్తున్నవి.
వచ్చే రోజువు ఎలా ఉంటాయో ఏమో
- అనే భావాన్నిచ్చేదిగా పూరించారు.
మీరు మరోవిధంగా పూరించి పంపండి.
No comments:
Post a Comment