చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని
సాహితీమిత్రులారా!
తమిళనాడులోని తిరిచినాపల్లిజిల్లా,
నవసాలపురమనే పుదుకోట(క్రొత్తకోట)
రాజైన శ్రీరాయ రఘునాథ తొండమాన్
మహీపాలుడు పూరించిన సమస్యలలోని
ఒక సమస్య ఇది-
చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని
పూరణ-
బలునిడివి యైన దాసరి పామొకండు
చెట్టు మీఁదను గొమ్మను జుట్టుకుండి
దెలియకను గూఁటిపిల్లలఁ గలయ ముక్కు
చేఁప కొంగను మ్రింగెను జెట్టుపైని
కొంగ ఒక చేపను తన ముక్కుతో ఎత్తుకొని ఒక వృక్షము మీద
కట్టుకొన్న తన గూటిలోని పిల్లకు చేపను పెట్టడానికి వెళ్ళింది.
ఆ చెట్టు కొమ్మను చుట్టుకొని ఉన్న పాము ఆ చేపను ముక్కుతో
పట్టుకొన్న కొంగను మ్రింగెను.
ముక్కునందుఁజేఁపగలకొంగ -
ముక్కుచేఁపకొంగ అని పూరించడంతో
పూరణ చమత్కారంగా మారింది.
ఆసక్తిగల మీరునూ పూరించి పంపండి.
No comments:
Post a Comment