పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా?
సాహితీమిత్రులారా!
వేమన పద్యాలను
నిగూఢ తత్వార్థ బోధిని
అనేపేరున ఆచార్యప్రబోధానంద
యోగీశ్వరులవారు వ్రాసి ఉన్నారు.
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా?
విశ్వదాభిరామ! వినురవేమ!
ఈ పద్యం తెలియని తెలుగువారుండరు.
దీన్ని మనం తల్లిదండ్రుల మీద పిల్లలకు
దయ ఉండాలి. అలా లేని పిల్లలు పుట్టినా
పుట్టకపోయినా పరవాలేదు. పుట్టలో చెదలు
పుడుతూంటుది చస్తూంటుంది దానివల్ల
ఏం ప్రయోజనం అలాగే వీరూనూ అని చెబుతూంటాం కదా!
మరి నిగూఢర్థంలో ఇలాగా ఉంది-
భగవద్గీత ప్రకారం సర్వజీవులకు ప్రకృతి తల్లి.
ఆ శరీరములకు చైతన్యమిచ్చి కదిలించేది ఆత్మ.
అదే పరమాత్మ తండ్రి. తల్లిదండ్రులైన ప్రకృతి
పరమాత్మలను తెలియనివాడు, ధ్యాసలేనివాడు,
వాటిమీద జిజ్ఞాస లేనివాడు పుట్టికూడ ప్రయోజనం లేదు.
శరీరంను తయారుచేసిన ప్రకృతిమీద, శక్తినిచ్చే ఆత్మ
మీద విచక్షణాజ్ఞానం లేనివాడు పుట్టలోని చెదలుతో సమానం - అని
నిగూఢార్థం.
No comments:
Post a Comment