Saturday, November 19, 2016

మోమారామమమాదంద్వే


మోమారామమమాదంద్వే




సాహితీమిత్రులారా!


ప్రహేళికలు చాలా రకాలున్నాయికదా!
వాటిలో ఇప్పటికి కొన్నింటిని చూచాము.
ఇప్పుడు మరోరకం -

మోమారామమమాదంద్వే
హయాగదలనంభష:
యస్యైతాని నవిద్యంతే 
స యాతి పరమాంగతిమ్

ఇందులోని భావం-

మోమారామమమాదంద్వే, హయాగదలనంభషలు
ఎవనికిలేవో వాడే పుణ్యలోకమును పొందును.
మోమారామమమాదంద్వే, హయాగదలనంభష లు
అంటే ఏమిటి ఇవి శ్లోక పూర్వార్థంలోనివి-
వాటిని ఈ క్రిందివిధంగా తీసుకుంటే
విషయం అర్థం అవుతుంది చూడండి-

మో మా రా మ మ మా దం ద్వే
హ యా  గ   ద  ల నం  భ    ష: 
- వీటిని నిలువుగా తీసుకుంటే

మోహము, మాయ, రాగము, మదము
మలము, మానము, దంభము,
ద్వేషము అనే పదాలు వస్తాయి.

ఇవి లేనివాడు పుణ్యలోకమును పొందును అని భావం.

No comments: