హరిద్రాయాం రాహుప్రసరపిహి..........
సాహితీమిత్రులారా!
ప్రహేళికలను
సైనికులు, గూఢచారులు
శత్రురాజుల వివరాలను
తెలియపరచడానికి వాడేవారు
అనడానికి ఈ ప్రహేళిక ఉదాహరణ-
హరిద్రాయాం రాహుప్రసరపిహితేచ్చాపరిషది
ప్రయుక్తాలంకృత్యైవియుత గరుతాం దుర్గకురటీం
వయం సార్కో పేతా: ప్రహర ఇతి పేనాధిపకృతాం
అమాత్యేభ్యో లేఖాం ప్రతిదిశతి సింహక్షతిపతి:
హరిద్రా, రాహు, ఇచ్ఛా, పరిషత్ ప్రయుక్తాలంకృతి,
వియుతగరుత్ దుర్గకురటీ, సార్క పదములవలన
క్రమంగా రాత్రి చీకటి, దిక్కులు, గుంపు, ప్రహారము,
విపక్షములు, దుర్గపురము, నాయక సమేతులు
- అనే అర్థాలు స్పురిస్తాయి.
దీని అసలు అర్థం-
అమాత్యులకు సింహదేశపు
రాజు విశదీకరించెను -
మేము ఇక్కడ సేనానాయకుని
వశంవదునిగా చేసికొనినాము-
కావున చీకటి బాగా అలుముకొనిన
తరువాత దుర్గపట్టణంలో ప్రవేశించి,
శత్రువులను చీల్చవలసినది
అని సేనానాయకుడు పంపినాడు - అని అర్థం.
No comments:
Post a Comment