Thursday, November 10, 2016

మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో


మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో




సాహితీమిత్రులారా!



వ్యపేతయమకంలో
మధ్యయమకం ఉదాహరణ చూడండి-

మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో
మధుమదారుణ హూణముఖచ్ఛవి:
తరణి దారుణ ఏష దిశ: సమం
మమ హృదారుణదామ్రవణానల:
                                                         (సరస్వతీకంఠాభరణమ్ - 2-109)

(ఓ తరుణీ మామిడితోట అనెడి అగ్ని
మదనుడన్న దారువు(కట్టె) నుండి పుట్టినదై
ఉన్నతమయిన శిఖలను(చిగుళ్ళు, జ్వాలలు)
గలదై మద్యమదము చేత మిక్కిలి ఎఱ్ఱనైన
హూణజాతీయుని ముఖముయొక్క కాంతివంటి
కాంతిగలదై మిక్కిలి దారుణమై నాహృదయముతో
సమముగా దిక్కులను బంధించెను.)


మదన దారుణ ఉద్ధిత ఉచ్ఛిఖో
మధుమదారుణ హూణముఖచ్ఛవి:
తరణి దారుణ ఏష దిశ: సమం
మమ హృదారుణదామ్రవణానల:

ఈ శ్లోకంలో ప్రతిపాదంలో దారుణ అనే
అక్షరగుచ్ఛము అదీ పాదము మధ్యభాగంలో
రావడం జరిగింది. అలాగే మొదటిపాదంలోని దారుణ-
రెండవపాదంలోని దారుణ - కు మధ్య మిక్కిలి ఎడమ
ఉండటంజరిగింది అలాగే 3,4 పాదాల్లోనూ రావడం వలన ఇది
వ్యపేతచతు పాద మధ్యయమకంగా చెప్పబడుచున్నది.

No comments: