వజ్రము పచ్చయ్యె పచ్చ వజ్రం బయ్యెన్
సాహితీమిత్రులారా!
సమస్య- వజ్రము పచ్చయ్యె పచ్చ వజ్రం బయ్యెన్
కందుకూరి రుద్రకవి పూరణ-
వజ్రమురా నీ హృదయం
బీ జ్రా ప్రాసంబు మాకు నీయం దగునా
వజ్రి సభ గరుడు డాడిన
వజ్రము పచ్చయ్యె పచ్చ వజ్రం బయ్యెన్
మొదటి రెండుపాదాలలో సమస్య ఇచ్చిన
వారి హృదయం వజ్రమని జ్ర - కార ప్రాస ఇవ్వవచ్చునా
అంటూ మిగిలిన రెండు పాదాలలో సమస్యను పూరించాడు.
(పచ్చని గరుత్మంతుడు మహేంద్రుని సభ పైన
ఎగురగా వజ్రానికి పచ్చని కాంతి వచ్చి పచ్చగా భాసించింది.
అతని ముక్కు తెల్లగా ఉంటుంది కనుక
ఆ కాంతి చేత పచ్చ వజ్రంగా భాసించింది.)
మణులలో గరుడ పచ్చ అని గరుడుని శరీరకాంతిని బట్టి పేరు
దాని పురస్కరించుకొని కవి దీన్ని పూరించాడు
మీరు మరోరకంగా పూరించి పంపండి.
No comments:
Post a Comment