Tuesday, November 1, 2016

చనినవెనుక రాకుండునవి


చనినవెనుక రాకుండునవి



సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం  చూడండి-

చనినవెనుకను రాకుండు జంటలెవియొ?
వచ్చినను పోకుండు వ్యవస్థ లెవియొ?
మరల వచ్చుచుఁ బోవునా మహిమలెవియొ?
తెలియఁ జెప్పుము తేటగ దెలియభువిని

దీనిలో మూడు ప్రశ్నలు ఉన్నవి
కాని ఇందులో సమాధానాలు లేవు.
వీటిని బయటనుండి గ్రహించి చెప్పవలెను
కావున ఇది బహిర్లాపికా ప్రహేళిక అవుతుంది.

1. మరణించిన తరువాత వెంటరాకుండునవి ఏవి?
2. వచ్చినవి పోకుండునవి ఏవి?
3. వచ్చి పోతూ ఉండేవి ఏవి?
అనేవి ప్రశ్నలు
వీటి సమాధానాలు బాగా ఆలోచిస్తే
మన జీవితంలోనివని తెలుస్తుంది.
1. మరణించిన తరువాత వెంటరాకుండునవి ఏవి?
    - కీర్తి, అపకీర్తులు
2. వచ్చినవి పోకుండునవి ఏవి?
    -పుణ్య,పాపములు
3. వచ్చి పోతూ ఉండేవి ఏవి?
    -కలిమిలేములు 


No comments: