ప్రశ్నోత్తరోక్తి -2
సాహితీమిత్రులారా!
ప్రశ్నోత్తరోక్తిలో రెండవ విధము
విద్వాంసుడు శబ్దవిద్యామహత్త్వముచేత
హృదయగత భావమును హృద్యంగా
భంగ్యంతరముగా స్ఫురింప చేసిన ఎడల
దానిని ప్రతీయమాన ప్రశ్నోత్తరోక్తిగా చెబుతారు.
ఉదాహృత శ్లోకము-
కియన్మాత్రం జలం విప్ర
జానుదఘ్నం నరాధిప
తథాపీయ మవస్థా తే
న హి సర్వే భవాదృశాః
ఇది రాజుకు పండితుని మధ్య జరిగిన ప్రసంగము
రాజు - విప్రా! జల మెంతమాత్రము
విప్రుడు - రాజా! మోకాళ్ళవరకు
రాజు- అంతమాత్రానికే నీకీ అవస్థా
విప్రుడు - అందరు మీ వంటివారు కారు కదా
దీనిలో రాజుకు ఉన్న సంపన్నత్వ విషయము,
దాతృత్వ విషయమున రాజుకున్న స్థానము ఉన్నతము
అదియే పండితోక్తిచేత ప్రతీతమానమయినది. కావుననే
ఇది ప్రతీయమాన హృద్యప్రశ్నోత్తరోక్తి అగుచున్నది.
No comments:
Post a Comment