తురగ పద బంధము
సాహితీమిత్రులారా!
తురగము అంటే గుర్రమనికదా
ఒక శ్లోకాన్ని నాలుగు పాదాలనూ
నాలుగు వరుసలలో వ్రాసి వాటిలో
గుర్రం చదరంగములో ఏవిధంగా
(ఆంగ్ల అక్షరం L లాగా)
వెళుతుందో ఆ విధంగా అక్షరక్రమం
తీసుకుంటే మరొక శ్లోకం వస్తుంది
దీన్నే తురగపదబంధము అంటున్నాము.
ఈ శ్లోకం భోజుని సరస్వతీకంఠాభరణంలోనిది
దీని నుండి తురగపదంలో వెళితే మరో శ్లోకం వస్తుంది.
బాలా సుకాలవాలాకా కాంతిలాలకలాలితా
సఖా సుతవతీ సారా దర్పికా వ్రతగర్ధిత
(2-299)
అర్థం-
చల్లని నల్లని కేశపాశము గలదియు,
కాంతిగల ముంగురులతో శోభించునదియు,
స్నేహపూర్ణయు, పగత్రవతియు, ఉన్నతురాలును,
దర్పము గలదియు, వ్రతానుష్ఠానము గలదియు
నైన బాల ఈమె. ఈమెను నీవు సేవింపుము.
ఈ శ్లోకాన్ని నాలుగుపాదాలు నాలుగు వరుసలలో వ్రాసిన
వాటికి తురగపదసంఖ్యలను వ్రాసిన ఈ క్రిందివిధంగా
వస్తాయి చూడండి-
దీన్ని తురగపద గమనం తో
మరోశ్లోకం పుడుతుంది అది-
సంఖ్యవారీ తీసుకొనగా ఏర్పడు శ్లోకము-
బాలా లలితతీవ్రఖా సుకలా రాగతర్పికా
సుదంతికా వర్ధి తావాసా కాలా తలలాసకా
(2-300)
అర్థం-
లలిత తీవ్రమైన ఆత్మ(స్వభావము)కలదియు,
మంచి కళ గలదియు, రాగముచేత తృప్తి
గలిగినదియు, చక్కని పలువరుస గలదియు,
గృహమును అభివృద్ధి పరచినదియు, నల్లనిదియు,
నాట్యమునందు పరాకాష్ఠ నందుకొన్నదియు నైన బాల.
ఈ శ్లోకము పై శ్లోకమునుండి ఒక్క అక్షరము కూడ
వదలకుండా అక్షరాలను తీసుకోబడినది. కాని స్థానముల
మార్పు జరిగినది.
No comments:
Post a Comment