Friday, May 12, 2017

కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతావృత్తము


కందపద్య తనుమధ్యావృత్త గర్భ ప్రియకాంతావృత్తము




సాహితీమిత్రులారా!



కొక్కొండ వేంకటరత్నంగారి
బిలేశ్వరీయములోని
ఈ పద్యం చూడండి-
ఇందులో కందపద్యం,
తనుమధ్య వృత్తములు
గర్భితమైన ప్రియకాంతా వృత్తము-


తపమును జాలం జలిపితి తన్వీ తనువయ్యెన్
విపులను బిల్వాట వినిట వెన్వెంటను నడ్మున్
విపులముగా నీ కిపుడవు విన్వృత్తము పేరే
నపరిమిత శ్రీకృపగను మన్వౌఁబ్రియకాంతా

ఇందలి(గర్భిత) కందపద్యం-

తపమును జాలం జలిపితి తన్వీ తనువయ్యెన్
విపులను బిల్వాట వినిట వెన్వెంటను నడ్మున్
విపులముగా నీ కిపుడవు విన్వృత్తము పేరే
నపరిమిత శ్రీకృపగను మన్వౌఁబ్రియకాంతా

తపమును జాలం జలిపితి
విపులను బిల్వాట వినిట విపులముగా నీ 
కిపుడవు నపరిమిత శ్రీ
కృపగను శ్రీకృపగను నపరిమిత శ్రీశ్రీ

గర్భిత తనుమధ్యవృత్తము-  
ప్రియకాంతా వృత్తము నందు చివరి
ఆరు అక్షరములు తీసుకున్న తనుమధ్యావృత్తమగును
.
తపమును జాలం జలిపితి తన్వీ తనువయ్యెన్
విపులను బిల్వాట వినిట వెన్వెంటను నడ్మున్
విపులముగా నీ కిపుడవు విన్వృత్తము పేరే
నపరిమిత శ్రీకృపగను మన్వౌఁబ్రియకాంతా

తన్వీ తనువయ్యెన్
వెన్వెంటను నడ్మున్
విన్వృత్తము పేరే
మన్వౌఁబ్రియకాంతా

No comments: