Tuesday, May 2, 2017

దీని వివరింపగదే


దీని వివరింపగదే




సాహితీమిత్రులారా!




ఈ పద్యం వివరించండి-
దీని వివరణ చెప్పగలరేమో చూడండి-

మత్కుణా పగయును మరి ధేను పత్నియు
సింధుసంభవంబు జేర్చి కటువు
భువి విచార ఫలము బొందింప నింపైన
గ్రామ చూర్ణమగును ఖండితముగ

దీని భావం వివరింపలరేమో ప్రయత్నించండి-

సమాధానం -
మత్కుణ - నల్లి
ఆపగ - ఏరు
మత్కుణాపగ - నల్లేరు
ధేను పత్ని - ఆవాలు
సింధుసంభవము - ఉప్పు
కటువు - కారము
విచారఫలము - చింతపండు
గ్రామచూర్ణము - ఊరుబిండి

నల్లేరు, ఆవాలు, ఉప్పు, కారము,
చింతపండు పొందించిన ఇంపైన
ఊరుబిండి అవుతుందట.

No comments: