శుద్ధాంధ్ర గోమూత్రికాబంధము
సాహితీమిత్రులారా!
శుద్ధాంధ్రము ఒక చిత్రమైతే
అందులో బోమూత్రికాబంధము కావడంతో
ఇది మిశ్రమ చిత్రము అవుతుంది.
శేషధర్మలోని ఈ పద్యం చూడండి
ఇది పూర్తిగా ఆంధ్రములో వ్రాయబడినది-
పులితోలుం బలుమేలుం
దలపై విన్నేటిజాలుదగునలవేల్పా
తెలిడాలుం నలుగేలుం
దలమౌ విల్మేటివాలుదగునెలదాల్పా
(శేషధర్మము 5ఆశ్వాసము)
దీనికి గోమూత్రికాబంధమును చూడండి
పులితోలుం బలుమేలుం దలపై విన్నేటిజాలుదగునలవేల్పా
తెలిడాలుం నలుగేలుం దలమౌ విల్మేటివాలుదగునెలదాల్పా
పు తో బ మే ద పై న్నే జా ద న వే
↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘↗ ↘
లి లుం లు లుం ల వి టి లు గు ల ల్పా
↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗ ↘ ↗↘ ↗
తె డా న గే ద మౌ ల్మే వా ద నె దా
No comments:
Post a Comment