చతుర్ధపాదగూఢము
సాహితీమిత్రులారా!
పద్యం యొక్క ఒకపాదాన్ని గోపనము చేసి
పద్యాన్ని వ్రాయడం గూఢచిత్రంలోని
ఒక విభాగం. ఇందులో పద్యం మొదటిపాదం
నుండి మూడవ పాదం వరకు గల అక్షరాలలో
నాలుగవపాదం అక్షరాలను గోపనం చేస్తారు
ఇది చతుర్ధపాదగూఢము.
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోని ఈ కందపద్యం ఉదాహరగా చూడండి-
వెలలి యుదార మధుర దయ
నిలుపు గుహన్ దత్తి నలరు నీవిడు భుక్తిన్
గలిని ఘనదేహ శౌరీ
దీని నాలుగవ పాదం కనుక్కోవాలంటే
ఈ మూడుపాదాలలోని అక్షరాలను
1,3,5,7, ఈవిధంగా అక్షరాలను తీసుకున్న
నాలుగవపాదం వస్తుంది.
వెలలి యుదార మధుర దయ
నిలుపు గుహన్ దత్తి నలరు నీవిడు భుక్తిన్
గలిని ఘనదేహ శౌరీ
అని నాలుగవపాదం వచ్చును
పూర్తి పద్యం ఇక్కడచూడండి.
వెలలి యుదార మధుర దయ
నిలుపు గుహన్ దత్తి నలరు నీవిడు భుక్తిన్
గలిని ఘనదేహ శౌరీ
వెలిదామరయలుఁగు దనరు విభుగనిన హరీ -
No comments:
Post a Comment