గీతద్వయ ద్విపద గర్భ సీసము
సాహితీమిత్రులారా!
ఒక సీసపద్యంలో
రెండు గీతపద్యాలు,
ద్విపద లక్షణాలను ఇమిడించి
కూర్చిన
గీతద్వయ ద్విపద గర్భసీసము
చూడండి -
ఇది శ్రీనివాసచిత్రకావ్యములోనిది-
శ్రీరమావర నన్ను ప్రేమార బ్రోవుము
నళిన నేత్ర ముకుంద నాగశయన
ధారుణీధర ధీర దైత్యారి సూరి కం
సారి శౌరి మురారి క్రూరహారి
పక్షి వాహన సర్వపాప ప్రహారి య
ఖర్వ భవ్యస్థైర్య కార్య ధుర్య
రక్షితామర భూవరా రమ్య వేషణ
బ్రోవరార బిరాన పుణ్య పురుష
దాన సద్గుణ శీల దాసానుకూల
జానకీ పరిపాల సద్గాన లోల
పావనాంచిత భావ భవ్య ప్రభావ
సేవకుంగనరావ శ్రీ దేవదేవ
మొదటి గీత పద్యం-
శ్రీరమావర నన్ను ప్రేమార బ్రోవుము
నళిన నేత్ర ముకుంద నాగశయన
ధారుణీధర ధీర దైత్యారి సూరి కం
సారి శౌరి మురారి క్రూరహారి
పక్షి వాహన సర్వపాప ప్రహారి య
ఖర్వ భవ్యస్థైర్య కార్య ధుర్య
రక్షితామర భూవరా రమ్య వేషణ
బ్రోవరార బిరాన పుణ్య పురుష
శ్రీరమావర నన్ను ప్రేమార బ్రోవు
ధారుణీధర ధీర దైత్యారి సూరి
పక్షి వాహన సర్వపాప ప్రహారి
రక్షితామర భూవరా రమ్య వేష
రెండవ గీత పద్యం-
శ్రీరమావర నన్ను ప్రేమార బ్రోవుము
నళిన నేత్ర ముకుంద నాగశయన
ధారుణీధర ధీర దైత్యారి సూరి కం
సారి శౌరి మురారి క్రూరహారి
పక్షి వాహన సర్వపాప ప్రహారి య
ఖర్వ భవ్యస్థైర్య కార్య ధుర్య
రక్షితామర భూవరా రమ్య వేషణ
బ్రోవరార బిరాన పుణ్య పురుష
నన్ను ప్రేమార బ్రోవుము నళిన నేత్ర
ధీర దైత్యారి సూరి కంసారి శౌరి
సర్వపాప ప్రహారి యఖర్వ భవ్య
భూవరా రమ్య వేషణ బ్రోవరార
ద్విపద-
శ్రీరమావర నన్ను ప్రేమార బ్రోవుము
నళిన నేత్ర ముకుంద నాగశయన
ధారుణీధర ధీర దైత్యారి సూరి కం
సారి శౌరి మురారి క్రూరహారి
పక్షి వాహన సర్వపాప ప్రహారి య
ఖర్వ భవ్యస్థైర్య కార్య ధుర్య
రక్షితామర భూవరా రమ్య వేషణ
బ్రోవరార బిరాన పుణ్య పురుష
దాన సద్గుణ శీల దాసానుకూల
జానకీ పరిపాల సద్గాన లోల
పావనాంచిత భావ భవ్య ప్రభావ
సేవకుంగనరావ శ్రీ దేవదేవ
శ్రీరమావర నన్ను ప్రేమార బ్రోవు
ధారుణీధర ధీర దైత్యారి సూరి
పక్షి వాహన సర్వపాప ప్రహారి
రక్షితామర భూవరా రమ్య వేష
దాన సద్గుణ శీల దాసానుకూల
జానకీ పరిపాల సద్గాన లోల
పావనాంచిత భావ భవ్య ప్రభావ
సేవకుంగనరావ శ్రీ దేవదేవ
No comments:
Post a Comment