అష్టదళ పద్మ బంధము
సాహితీమిత్రులారా!
ఆంధ్ర లక్ష్మీసహస్రంలోని
ఈ అష్టదళ పద్మ బంధము
చూడండి -
ఇందులో కవిపేరు
గోపనము చేశారు-
స్రగ్ధరావృత్తము-
మాతా రమ్యాక్షి రమ్మామరగగఁగర మంబా ఘృణద్దేవతా మా
మాతా వద్దేది నా కామరదద దర మమ్మా చరిత్రావ్రతీ మా
మాతీవ్రత్రా యనంగా మహితతతహిమ మ్మాద రమ్మా రతో మా
మాతోరమ్మా ఘనుండంబ్రరమ మమరబ్రహ్మాండగమ్యా రతామా
దీన్ని అష్టదళ పద్మ బంధముగా గీయగా
ఈ క్రింది విధంగా వస్తుంది.
ఇందులో దళముల అగ్రములందు గల
అక్షరములను కలుపగా-
రఘునాధనందనుండ అని వస్తుంది
దీన్ని రఘునాథుడు సంస్కృతంలో
వ్రాయగా అనువాదకర్త ఆయనకుమారునిగా
భావించి రఘునాధనందనుడని చెప్పికొన్నాడు.
ఇందులో పద్మము మధ్యలో మా - అనే అక్షరం
ఉంటుంది. ఈ పద్యం ప్రతిపాదంలో చివరి
నాలుగక్షరములు తరువాతి పాదం మొదటిలో వస్తుంది
చిరిపాదం నాలుగక్షరాలు మొదటిపాదం మొదట్లో వచ్చాయి.
మాతా రమ్యాక్షి రమ్మామరగగఁగర మంబా ఘృణద్దేవతా మా
మాతా వద్దేది నా కామరదద దర మమ్మా చరిత్రావ్రతీ మా
మాతీవ్రత్రా యనంగా మహితతతహిమ మ్మాద రమ్మా రతో మా
మాతోరమ్మా ఘనుండంబ్రరమ మమరబ్రహ్మాండగమ్యా రతామా
మధ్యలోని మా - తో ప్రారంభించి పైకి అక్షరములు
కలుపుకొంటూ చివరికి చేరిన తరువాత దిగువ అక్షరాలను
కలుపుకోవాలి కుడివైపుకు దిగుచూ చివరి అక్షరాన్ని
మూడుమార్లు కలుపుకొని క్రిందికి దిగి మధ్యలోని మా -
కలుపుకోవాలి.
పద్యం చూస్తూ బంధం చదివితే విషయం పూర్తిగా
అవగతమౌతుంది.
No comments:
Post a Comment