Friday, May 26, 2017

షట్చక్రవర్తి షోడశరాజనామాభిరామ ప్రాసభేద భాసమానవృత్తము

షట్చక్రవర్తి షోడశరాజనామాభిరామ 
ప్రాసభేద భాసమానవృత్తము

సాహితీమిత్రులారా!

ప్రబంధరాజ వేంకటేశ్వర 
విజయవిలాసములోని
ఈ పద్యం చూడండి-
ఇందులో షట్చక్రవర్తుల పేర్లు,
షోడశమహారాజుల పేర్లతో పాటు
ప్రాస భేదంతో కూర్చబడిన పద్యం.

పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

భూమిమీద షట్చక్రవర్తులను, షోడశమహారాజులను
మించవయా ఓ హరీ  అని భావం.

ఈ పద్యంలో షట్చక్రవర్తులను గమనించండి-
పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!

హైహయజున్= కార్తవీర్యార్జునుడు
జంద్రమత్యధిపు = హరిశ్చంద్రుడు
షట్చక్రవర్తులు-
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు,
పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు.

షోడశమహారాజులను గమనించండి-

పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
రథుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం
బృథుని యయాతి రంతి శశిబిందుని భార్గవు మించవే హరీ!
షోడశమహారాజులు-
గయుడు, అంబరీషుడు, శశిబిందువు,
అంగుడు, పృథువు, మరుతి, సుహోత్రుడు,
పరశురాముడు, శ్రీరాముడు, భరతుడు, దిలీపుడు,
భృగుడు, రంతిదేవుడు, యయాతి, మాంధాత,
భగీరథుడు

ఈ పద్యంలో ప్రాసలో -కారము మొదటి,మూడవ, నాలుగవ పాదాల్లో ఉంది కాని రెండవపాదంలో - కారము ప్రయోగించబడినది- గమనించగలరు.

పృథువిఁ బూరూరవు స్సగరు హైహయజున్ బురుకుత్సుఁ జంద్రమ
త్యధిపు నలుం దిలీపు యవనాశ్వభవుం భరతున్ గయు న్భగీ
థుని మరు త్తనంగు శిబి రాము సుహోత్రుని నంబరీషునిం

No comments: