Saturday, May 13, 2017

ఆస్తికుఁడననేమి? నాస్తికుఁడననేమి?


ఆస్తికుఁడననేమి? నాస్తికుఁడననేమి?




సాహితీమిత్రులారా!



పొడుపు పద్యం చూడండి-
సమాధానం చెప్పగలరేమో-


ఆస్తికుఁడననేమి? నాస్తికుఁడననేమి?
                                వేఱర్థములవేవి వేంకటేశ?
ఓషధియననేమి? ఔషధమననేమి?
                                వేఱర్థములవేవి వేంకటేశ?
రాజన్యుఁడననేమి? రాజనుఁడననేమి?
                                 వేఱర్థములవేవి వేంకటేశ?
దీర్ఘదేహియదేది? దీర్ఘమైధువమేది?
                                వేఱర్థములవేవి వేంకటేశ?
శాస్త్రపద్ధతిలో నపశబ్దమేది?
శాస్త్రపద్ధతిలో నపస్వరమదేది?
మెప్పుగా నర్థభేదాలు చెప్పవలయు
దేవ శ్రీ వేంకటేశ! పద్మావతీశ!

సమాధానాలు-

ఆస్తికుడు - దైవవిశ్వాసముకలవాడు
నాస్తికుడు - దైవవిశ్వాసం లేనివాడు
ఓషధి - వనమూలిక
ఔషధము - వనమూలికలతో చేసిన మందు
రాజన్యుడు - క్షత్రియుని కుమారుడు
రాజనుడు -  భూపాలుని కుమారుడు
దీర్ఘదేహి - పందికొక్కు
దీర్ఘమైధువము - శునకము
అపశబ్దము - వ్యాకరణ విరుద్ధపదము
అపస్వరము - మంత్రోచ్ఛారణఁదోషము

No comments: