Tuesday, May 23, 2017

ద్విపాది


ద్విపాది




సాహితీమిత్రులారా!



ఒక శ్లోకం/ పద్యంలో ఏరెండు పాదాలు
సమానంగా ఉన్న దాన్ని ద్విపాది అంటారు.
దీనికే సముద్గతయమకము అనికూడ అంటారు.
భారవి కృత కిరాతార్జునీయమ్ లోని ఈ శ్లోకం
చూడండి-

స్యందనా నో చతురగాః 
సురేభా వావిపత్తయః
స్యందనా నో చ తురగాః
సురేభా వా విపత్తయః

ఈ ముని వద్ద వేగంగా పరుగెత్తే రథాలుగాని,
మంచినడకగల్గిన గుర్రాలుగానీ, బాగాఘీంకరించే
దేవగజాలుగాని, ఏ విఘ్నాలులేని పదాతి దళాలుగాని
లేవు. అందువల్ల భయపడాల్సిన పనేలేదు.
చతురంగబలలాల్లో ఏ ఒక్కటీ లేనపుడు భయమెందుకు
- అని భావం

ఇందులో 1,3 పాదాలు, 2,4 పాదాలు
సమానంగా ఉన్నవి కావున ఇది
ద్విపాది అగుచున్నది.
అలాగే పూర్వ ఉత్తర భాగాల్లోని
విశేషణ- విశేష్యాలకు, ఉద్దేశ ఉద్దేశ్యీ
భూతాలైన వానిని యథాసంఖ్యంగా
కూర్చటం జరిగింది కావున దీనికి
సముద్గతయమకమని పేరు.



No comments: