Tuesday, May 30, 2017

ప్రశ్నోత్తరోక్తి


ప్రశ్నోత్తరోక్తి




సాహితీమిత్రులారా!



ప్రశ్న-ఉత్తరము+ ఉక్తి = ప్రశ్నోత్తరోక్తి
ఇది రెండు రకములని
సరస్వతీ కంఠాభరణంలో చెప్పబడుచున్నది.
మొదటి రకము -
వక్త స్పష్టముగా తనమనోభావమును తెలిపిన దానిని
అభిధీయమాన హృద్యము అంటారు
దీనికి ఉదాహరణ అమరుక శతకంలోనిది-

క్వ ప్రస్థితాసి కరభోరు ఘనే నిశీథే
ప్రాణేశ్వరోవలతి యత్ర మనఃప్రియే మే
ఏకాకినీ వద కథం న బిభేషి బాలే
నన్వస్తి పుంఖితశరో మదనః సహాయః

సంకేత స్థానాన్ని చేరుకొన్న ప్రియురాలిని
ప్రియుడు ప్రశ్నిస్తున్నాడు-

కరభోరూ! దట్టమైన చీకటిలో ఎక్కడికి బయలుదేరావు

నా మనఃప్రియుడు ప్రాణేశ్వరుడు ఉండేచోటుకు

బాలా! ఒక్కతివేకదా! భయపడకుండా వెళుతున్నావు
కారణమేమి?

బాణం సంధించి మదనుడు సహాయుడై ఉన్నాడు కదా!

ఇందులో తన మనసులోని మాటను స్పష్టంగా చెప్పడం
వలన ఇది అభిధీయమానహృద్యప్రశ్నోత్తరి అగుచున్నది.

No comments: