Sunday, May 21, 2017

దీని పేరు నెద్దియొ చెపుమా


దీని పేరు నెద్దియొ చెపుమా




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం చూడండి
విప్పగలరేమో

వృక్షము మూఁడక్షరములు
తక్షణమున మధ్యగురువు తగ్గించినచో
నక్షయము వర్తమానము
నీక్షించును దీనిపేరు నెద్దియొ చెపుమా

ఇది మూడక్షరాలుగల చెట్టట,
దీనిలోని మధ్యగురువును తగ్గించిన
అంటే తీసివేస్తే ప్రస్తుతమని అర్థం వస్తుందట
మరి దీని పేరేదో చెప్పమంటున్నాడు కవి-
చూడండిమరి.

సమాధానం - నేరేడు
ఇందులో మూడక్షరాలున్నాయి.
మధ్యగురువు తీసివేస్తే - నేడు
అంటే ప్రస్తుతమనేగా
సరిపోయింది కదా సమాధానం.

No comments: