మూగబిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్
సాహితీమిత్రులారా!
సమస్య-
మూగబిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్
విద్వాన్ వి.యమ్. భాస్కరరాజు గారి పూరణ-
రాగమనోజ్ఞమూర్తియయి రాధ-మనోహరువేణుగానముల్
ఏగతి విందునో అనుచు-హేధవ మాధవ యంచు ప్రార్థనల్
వేగమె చేయ- కృష్ణుడును వేణువునూదగ-రాధ సంతస
మ్మూగ, బిరాన పాడె నవమోహనమంజులకృష్ణగీతికల్
ఈ సమస్యలో మూగవాడు పాడినట్లు చెప్పబడింది
ఎలా సాధ్యం. అంటే మూగ కాదు, సంతసమ్మూగ
అని మార్చడంతో సమస్య రసవంతంగా మారింది.
మీరును మరో విధంగా పూరించి పంపగలరు.
No comments:
Post a Comment