అక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
సాహితీమిత్రులారా!
సమస్య -
అక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
పూర్వకవిపూరణ-
రక్కసివలె నే ప్రొద్దును
మెక్కుచుఁదిరిగెదవు కాలిమెట్టున నిన్నుం
గుక్కక మానను దసినీ
యక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
దీనిలో భర్త భార్యను అక్కా అని బంబోధించడం
అసంబద్ధంకదా దాన్ని కవి
కోపంగా మాట్లాడినట్టు దసినీ యక్కా అని వాడడంతో
సంగతమైనది.
మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు
No comments:
Post a Comment