Monday, May 8, 2017

జూతుమె లవుడా యటంచు సుందరిపలికెన్


జూతుమె లవుడా యటంచు సుందరిపలికెన్




సాహితీమిత్రులారా!


సమస్య-
జూతుమె లవుడా యటంచు సుందరిపలికెన్

ఇందులోని పదజాలము వినటానికి అశ్లీలగా ఉన్నదికదా
దీన్ని సరిచేసి చెప్పడమే కవిచాతుర్యం

పూర్వకవి పూరణ-

ఖ్యాతిగల రామచంద్రుఁడు
చేతోమోదంబుతోడఁ జెలఁగుచు నెంతేఁ
బ్రీతిగ నిటఁజనుదెంచినఁ
జూతుమె లవుడా యటంచు సుందరిపలికెన్

ఇందులో లవుడా అన్న అన్యదేశ్యపదాన్ని
సాధారణపదంగా రామకుమారుడు - లవునిగా
మార్చాడు. దీనితో అశ్లీలార్థము అంతరించినది.

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.

No comments: