ఏకస్వర - ద్వ్యక్షరి
సాహితీమిత్రులారా!
అ,ఆ-లు రెండిటిని అత్వము అంటాము.
ఈ స్వరములను మరియు
ప, ద - అనే రెండు వ్యంజనాలను
ఒకే శ్లోకంలో ఉపయోగించారు
వేదాంతదేశికులవారు
కావున దాన్ని మిశ్రమ చిత్రమంటారు.
ఆ శ్లోకం చూడండి-
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
పాదపా పాదపా పాదపా పాదపా
స్థావర జంగమాలకు కలిగే దోషాలను
తొలగించే అభిషేకతీర్థం కలది పాదుక.
పరమవ్యూహ విభవాదులందు భగవంతుడు
ధరించిన పాదుక సంచారం చేత ఇహలోకాలను
రక్షిస్తుంది. భగవన్నిష్ఠ నిగ్రహానుగ్రహజనకమైన
పాదుక అవశ్యంగా రక్షింపదగిన మాతాపిత్రాదులను
రక్షించే వారి పట్ల శుభాన్నీ, రక్షించే దక్షత కలిగి
ఉన్నా రక్షింపక ఉపేక్షించే వారి విషయమై
అఏశుభాన్నీ సంకల్పిస్తుంది. భగవదనుభవ శీలురైన
సాధుజనుల శమదమాది గుణాలను వృద్ధి పరచేది
ఇంద్రాది లోకపాలకులను రక్షించే భగవత్పాదుకయే.
స్వాశ్రితజనవిరోధులను శోషింపజేసే కిరణాలను కాపాడేదీ
పాదుకయే - అని భావం.
ఈ శ్లోకాన్ని మొదట బంధ-శబ్దచిత్రాల
మిశ్రమ చిత్రంగా విరించుకున్నాము
ఇక్కడ శబ్దచిత్రంలో మిశ్రమచిత్రంగా
తెలుసుకున్నాము.
No comments:
Post a Comment