నవరసయుక్త సీసము
సాహితీమిత్రులారా!
19వ శతాబ్దంలోనివసించిన
ముడుంబ నరసింహాచార్యస్వామిగారి
అంగశృంగారంలోని
ఈ పద్యం చూడండి
ఇందులో నవరసములు
సీసములో కూర్చడం జరిగింది.
దీన్ని శబ్దచిత్రంలోనిదిగా చెప్పవచ్చు.
నిలువెల్ల శృంగారనిధిపుష్పమృదులాంగి
చంద్రుహాస్యముసేయు సఖముఖము
కరుణించుచెలి కనుల్ కర్ణోత్పలములపై
చివురన్న రౌద్రంబు జిందువడుగు
పెనువీరమునకొండపిండిసేయును చనుల్
మృగదృగ్భయానకంబగుర చూపు
పాణులంభోజబీభత్సప్రవీణముల్
ప్రత్యంగ మద్భుతవ్రక్రమంబు
ఇతరనిర్వేద మొనరించు నతివమూర్తి
నవరసావేశపూర్తి విన్యాసమిందె
గాన నింకొక్కచోనిట్లుగానఁబడదు
హరిజగన్మోహినీరూపమందుదక్క
(అంగశృంగారము - 34)
ఇందులో గల నవరసాలు
గమనింపుడు
నిలువెల్ల శృంగారనిధిపుష్పమృదులాంగి
చంద్రుహాస్యముసేయు సఖముఖము
కరుణించుచెలి కనుల్ కర్ణోత్పలములపై
చివురన్న రౌద్రంబు జిందువడుగు
పెనువీరమునకొండపిండిసేయును చనుల్
మృగదృగ్భయానకంబగుర చూపు
పాణులంభోజబీభత్సప్రవీణముల్
ప్రత్యంగ మద్భుతవ్రక్రమంబు
ఇతరనిర్వేద మొనరించు నతివమూర్తి
నవరసావేశపూర్తి విన్యాసమిందె
గాన నింకొక్కచోనిట్లుగానఁబడదు
హరిజగన్మోహినీరూపమందుదక్క
No comments:
Post a Comment