Monday, May 22, 2017

ద్వ్యక్షరి కందము


ద్వ్యక్షరి కందము




సాహితీమిత్రులారా!


రెండు వ్యంజనాలతో కందము కూర్చడం
ఇందులో ఏ అచ్చై(స్వరమై)నా ఉండవచ్చును.
ఈ విధంగా కూర్చిన కంద పద్యాన్ని
ద్వ్యక్షర కందము అంటారు.

ఇక్కడ కొన్ని గ్రంథాలలోని ద్వ్యక్షరులు చూద్దాం.

కాకలికాకలకలకల
కోకిలకులలీలకలులకులుకులకలుకే
కైకోకుకేలికొలఁకుల
కో కాలీకేలికులికికొంకకుకలికీ
                                                               (వరాహపురాణము11-69)
ఇందులో క,ల - అను వ్యంజనాలను మాత్రమే
ఉపయోగించి కూర్చారు.

వేదవదావదవాదవి
వేదేదేవాదిదేవవిద్వద్వేదీ
వాదీదేవీదేవవి
వేదేవేదుద్దుదిద్దవేవేదావే
                                  (వాసవదత్తాపరిణయము -4-79)
ఇందులో వ, ద, అనే వ్యంజనాలను
ఉపయోగించి కూర్చారు.

నానెమ్మనమునుమానీ
మాననిమౌనమునమననుమన్నననన్నో
మానిని నీమనముననను
మానము మానమునుమానిమనమునునెమ్మిన్
                                                                 (కళాపూర్ణోదయము -7-219)

ఇందులో న,మ - అను వ్యంజనములను కూర్చి
పద్యం వ్రాయబడింది.


ఈ విధంగా చాల ద్వ్యక్షరి కందములను చూడవచ్చు.

No comments: