Thursday, May 11, 2017

శ్రీకర గర్భిత చంద్రశేఖర వృత్తము


శ్రీకర గర్భిత చంద్రశేఖర వృత్తము




సాహితీమిత్రులారా!


కొక్కొండ వేంకటరత్నంగారి
బిలేశ్వరీయములోని
ఈ గర్బిత చిత్రము చూడండి-
ఇందులో చంద్రశేఖర వృత్తములో
శ్రీకర వృత్తము ఇమిడ్చి వ్రాయడమైనది.

చంద్రశేఖర వృత్తము-

శివజగదీశ మమ్ముబోవు చంద్రశేఖరా
శివనగదయ్య కావనేని నల్వెశ్రీకరా
శివమగు నీకు మిత్ర భూత యక్షశేఖరా
శివమగు మాకు బిల్వనాథ యాప్తశ్రీకరా

దీనిలోని ప్రతిపాదం నందు
మొదటి రెండు అక్షరాలు తొలగించిన
శ్రీకరా వృత్తమగును.

గర్భిత శ్రీకరా వృత్తము -

జగదీశ మమ్ముబోవు చంద్రశేఖరా
నగదయ్య కావనేని నల్వెశ్రీకరా
మగు నీకు మిత్ర భూత యక్షశేఖరా
మగు మాకు బిల్వనాథ యాప్తశ్రీకరా

No comments: