శరబంధము
సాహితీమిత్రులారా!
వేదుల సత్యనారాయణశర్మ గారి
ఆంధ్ర లక్ష్మీసహస్రములోని
శరబంధము చూడండి-
శరబంధము అంటే
బాణబంధము అని అర్థం
ఇందులో గోమూత్రికా
బంధములోని విధంగానే
ఉన్నట్లు అనిపిస్తుంది
ప్రమాణీ వృత్తము-
సముద్రజోన్నతామహా
క్షమాసుధీప్రతారికా
సముద్రజోన్వితారిహా
కుమార్గధీవ్రతారికా
దీన్ని రెండుపాదములుగా వ్రాసిన-
సముద్రజోన్నతామహా క్షమాసుధీప్రతారికా
సముద్రజోన్వితారిహా కుమార్గధీవ్రతారికా
న్న మ క్ష సు ప్ర
సముద్రజో - తా - హా - మా - ధీ - తారికా
న్వి రి కు ర్గ వ్ర
అని గోమూత్రికా బంధములో వలెనే వ్రాయబడిన శరబంధము
చిత్రాన్ని గమనించండి
No comments:
Post a Comment