పాదగోపనము
సాహితీమిత్రులారా!
పాదగోపనము అనునది
ఏపాదము గోపనమైన ఆపేరుతో
పిలువబడుచుండును.
ప్రస్తుతము విక్రాల శేషాచార్యులవారి
శ్రీవేంకటేశ్వర చిత్రరత్నాకరములోని
పుట 21న గల పాదగోపనము చూచుచున్నాము.
ఇది నాలుగవ పాదము గోపనము చేయబడినది
అందుచే దీనిని చతుర్థ పాదగూఢము అంటాము.
గమనించుము-
మొదటి మూడు పాదములలో నాలుగవపాదములోని
అక్షరాలను గోపనము చేసి ఉందురు. వాటిని తీసిన
నాలుగవపాదము వచ్చును.
అజ భుజగద్విషద్రథ సుధాషన మానవరక్ష మాధవా
అజిత జనిక్షయాద్యతిగ హారవిభూష కరుఘ్ఘృణాక ర
క్తజనగ నిన్ను తామసులు కాసరుగా వుపమావిదూరగా
దీనిలోని రంగుచేయబడిన అక్షరాలనన్నీ వరుసగా వ్రాసి
నాలుగపాదము
భుజగవరక్షమాధరవిభూకరుణాకర నన్ను కావుమా
అని వచ్చును.
పూర్తి పద్యము ఇక్కడ చూడండి-
అజ భుజగద్విషద్రథ సుధాషన మానవరక్ష మాధవా
అజిత జనిక్షయాద్యతిగ హారవిభూష కరుఘ్ఘృణాక ర
క్తజనగ నిన్ను తామసులు కాసరుగా వుపమావిదూరగా
భుజగవరక్షమాధరవిభూకరుణాకర నన్ను కావుమా
No comments:
Post a Comment