Saturday, May 6, 2017

సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు


సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు 




సాహితీమిత్రులారా!


సమస్య-
సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుండయ్యెడున్

సంసారము రాజయోగికే,
యతికి తగదు కదా

సి.వి.సుబ్బన్నగారి పూరణ-

హంసీయాన సుధానిధాన సతి బ్రహ్మానంద సంజ్ఞాక స
చ్ఛంసాయోగ్యులు శిష్యులే సుతులు విజ్ఞానంబ విత్తంబు సా
యం సంధ్యారుచిమత్పటావళులు వస్త్రాలంకృతుల్గా జగత్
సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు పూజాభాజనుండ  య్యె డున్

దీనిలో సంసారస్థితుడైన యతీశ్లరుడు
అనే దాన్ని జగత్ సంసారస్థితుఁడై యతీశ్వరుఁడు
అనడం వల్ల అర్థం మారిపోయి సందర్భోచితంగా మారింది.


మీరునూ మరోవిధంగా పూరించి పంపగలరు

No comments: