Sunday, May 7, 2017

భూమీశా నరులకాళ్లు భోజనమయ్యెన్


భూమీశా నరులకాళ్లు భోజనమయ్యెన్




సాహితీమిత్రులారా!




సమస్య-
భూమీశా నరులకాళ్లు భోజనమయ్యెన్

పూర్వకవి పూరణ-

చీమలకాళ్లేలావున
సామజముల కాళ్లుచాలసన్నం బయ్యెన్
భామలకాళ్లేచుల్కన
భూమీశా! నరులకాళ్లు భోజనమయ్యెన్

ఇందులో కాళ్లు అనే పదాన్ని
కవి కాళ్లుగా తీసుకోలేదు
చీమలకు - ఆళ్లు - చీమలకాళ్లు
ఆరుగ - లు - ఆళ్లు
ఆళ్లు అంటే ధాన్యవిశేషము
ఆరికె అనే ధాన్యంగా తీసుకోవచ్చు.
చీమలకు ఆరికె ధాన్యం పెద్దగా కనిపిస్తుంది.
అదే ధాన్యం ఏనుకు చిన్నగా కనిపిస్తుంది
అదే ఆడవాళ్లకు చులకనగా ఉంటుంది
ఓ భూమీశా మనుషులకు ఆరిక ధాన్యమే
భోజనం అంటున్నాడుకవి.

మీరునూ మరోరకంగా పూరించి పంపండి

No comments: