Friday, May 26, 2017

కందద్వయగర్భిత భాస్కరవిలసితవృత్తము ముద్రాలంకారము

సాహితీమిత్రులారా!

ఈ పద్యం శీర్షికే ఎంత పెద్దగా ఉందోకదా
ఇది ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము
లోనిది(825)-
ఇందులో భాస్కరవృత్తములో
రెండు కందపద్యాలు ఇమిడి ఉన్నాయి
మరియు ఈ పద్యం ముద్రాలంకారంలో ఉంది.

భాస్కరవిలసిత వృత్తము-
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఇందులో గర్భితమైన మొదటికందము-

పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

పంకజదళ నిభలోచన 
శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ 
పంకోరస్థలకృతపద వననిధి కన్యా

రెండవ గర్భిత కందము-
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

లంకృత మణిగణభూషణ
యం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యక
లంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఈ వృత్తముపేరు భాస్కరవిలసితము అని
పద్యంలో రావడం వల్ల ఇది
ముద్రాలంకారమౌతుంది.
పంకజదళ నిభలోచన శంకాభావ మునిహృదయ సతత విహారా
కుంకుమమృగమద సాంకవ పంకోరస్థలకృతపద వననిధి కన్యా
లంకృత మణిగణభూషణయం కీకృత మృదుగతి మరుద సితశరీరా
వేంకటగిరివర రుచ్యకలంకా భాస్కరవిలసిత లగదరిహస్తా

ఇందులో గర్భిత పద్యాలున్నాయి 
కావున ఇది గర్భచిత్రము.
మరియు శబ్దాలంకారమైన
ముద్రాలంకారమున్నందున
ఇది శబ్దాలంకార చిత్రము
అవుతున్నది.
రెండు చిత్రములిందులో ఉన్నందున

ఇది మిశ్రమ చిత్రమవుతుంది

No comments: