పతిగాని పతియెవడు?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం చూడండి
విప్పగలరేమో
పదముగానటువంటి పదమేదియగుచుండు?
దారముగానట్టి దారమేది?
రతముగానటువంటి రథమేదియగుచుండు?
సూత్రమ్ముగానట్టి సూత్రమేది?
శ్రుతిగానియటువంటి శ్రుతియేదియగుచుండు?
నాధుండుగానట్టినాధుఁడెవఁడు?
రణముగానటువంటి రణమేదియగుచుండు?
రంగమ్ముగానట్టిరంగమేది?
నాగమేగానియటువంటినాగమేది?
పతియదార్థముగానట్టిపతియెవండు?
మెప్పుగా నుత్తరమ్ములు చెప్పవలయు
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!
(శ్రీ వేంకటేశ సారస్వతవినోదిని)
పదముగానిపదము - జనపదము(గ్రామము)
దారముగానిదారము - చెదారము(తృణలేశము)
రథముగానిరథము - చాగరథము(అగ్ని)
సూత్రముగానిసూత్రము - కటిసూత్రము(మొలత్రాడు)
శ్రుతిగాని శ్రుతి - జనశ్రుతి(లోకవదంతి)
నాథుడుగాని నాథుడు - జగన్నాథుడు(విష్ణువు)
రణముగాని రణము - తరణము(ఓడ)
రంగముగాని రంగము - తరంగము (అల)
నాగముగాని నాగము -
తుత్తునాగము(బూడిదరంగులోహము)
పతిగాని పతి - పశుపతి (ఈశ్వరుడు)
No comments:
Post a Comment