అమ్మా! రమ్మని పిల్చె భార్యను
సాహితీమిత్రులారా!
సమస్య -
అమ్మా! రమ్మని పిల్చె భార్యను మగండయ్యర్థ రాత్రంబునన్
శతావధాన ప్రబంధము ద్వితీయఖండము నుండి
పూరణ -
క్రమ్మెన్ మేఘము లీడతోడ జినుకు ల్రాలం దొడంగె న్గడున్
నెమ్మెక్కెన్ శయనమ్ము, దుప్పటియు మన్నింపందగుం దప్పులన్
వేమ్మున్నెమ్మది, ముద్దుగుమ్మ యల పూవిల్కాని క్రొందమ్మియౌ
నమ్మా రమ్మని పిల్చె భార్యను మగండర్థ రాత్రంబునన్
క్రొందమ్మి- అప్పుడే వికసించిన తామరపూవు,
తామరపూవు మన్మథబాణాలలో ఒకటి.
ఔ +అమ్మా = యౌనమ్మా ,
అమ్మా , అమ్ము = బాణము
అమ్మా= ఆ + అమ్మా = బాణమా
అంటే ఓ మన్మథబాణమా!
అమ్మా అనేదాన్ని బాణంగా అర్థంమార్చి
ప్రయోగించాడు కవి. అందువల్ల సమస్య
పూరణ రమణీయంగా మారింది.
ఆకాశం మబ్బులు కమ్మి ఈదురుగాలి వీస్తున్నది.
చినులు రాలుతున్నాయి. పరుపు దుప్పటి కూడ
తేమతో చల్లబడ్డాయి, నా పొరపాట్లను మన్నించి
కోపాన్ని వదులుకో తాపం కలుగుతూంది. పూలే
బాణాలుగా గల మన్నమథుని బాణమైన దానా
నా సమీపానికి రమ్మని అర్థరాత్రి సమయంలో
భార్యను భర్త పిలిచినాడని భావం
మీరునూ మరో రమ్యమైన భావనతో పూరించి పంపగలరు.
No comments:
Post a Comment