Monday, December 5, 2016

ఘనరావంబు చెలంగ భృంగివినతుల్


ఘనరావంబు చెలంగ భృంగివినతుల్



సాహితీమిత్రులారా!

చరిగొండ ధర్మన్న కృత చిత్రభారతములోని
ఈ ద్విపది చూడండి-

పద్యంలోని నాలుగుపాదాలలో 1,2 పాదాలు ఒకేలా,
3,4 పాదాలు ఒకేలా ఉంటే దాన్ని ద్విపాది అంటాం.
అలాకాక 1,3 పాదాలు ఒకేలా, 2,4పాదాలు ఒకేలా
ఉన్నా దాన్ని కూడా ద్విపది అంటారు. ఈ పద్యంలో
1,3 ఒకేలా, 2,4పాదాలు ఒకేలా ఉన్నాయి. చూడండి-

ఘనరావంబు చెలంగ భృంగివినతుల్ గావించిపాడంగఁ గా
ననమందెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లెఁ దా
ఘనరావంబు చెలంగ భృంగి వినతుల్ గావించిపాడంగఁ గా
ననమందెచ్చట నీలకంఠవిలసన్నాట్యంబు రంజిల్లెఁ దే
                                                                                     (చిత్రభారతము -2-19)

గొప్పశబ్దం(ఓంకారం)అతిశయించగా భృంగి మొదలగు
వారు పాడగా కైలాసమునందు శివుని నాట్యం రంజిల్లింది.
మేఘము రాగా, తుమ్మెదలు పాడగా అరణ్యమునందు
నెమళ్ళ నాట్యం రంజిల్లదా? - అని భావం.
(భృంగి - భృంగి, తుమ్మెద
నీలకంఠ - శివుడు, నెమలి)

No comments: