Sunday, December 18, 2016

శ్రీరత మహిమతరశ్రీ


శ్రీరత మహిమతరశ్రీ




సాహితీమిత్రులారా!


పాదభ్రమకము అనే గతిచిత్రాన్ని
ఇక్కడ చూద్దాం-

గతి అంటే నడక
నడకలోని చిత్రం
గమనించటమే
ఇందులోని చిత్రం.

ఒకమాట ముందుకే గాదు
వెనకకూ అలాగే ఉంటే
మనము అది చిత్రంగా
గుర్తిస్తాం కదా
అదే పద్యపాదమైతే
అది ఇంకా చిత్రం
పులుపు, జలజ, వికటకవి - ఇలాంటి పదాలు
ముందుకు వెనక్కు ఒకలాగే చదువుతాం కదా!

ఈ పద్యం చూడండి-
ఇది శ్రీమాన్ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారి
సంపాదకత్వంలో వెలువడిన
అధ్యాత్మరామాయణంలోనిది-

ఇది సుందరకాండలోని ఆశ్వాసాంతంలో
కాణాదం పెద్దన సోమయాజిగారు హనుమంతుడు
లంకకువెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో కూర్చడం
ఒక విశేషం-

శ్రీరత మహిమతరశ్రీ
సారసవనయ శహితాహి శయనవసరసా
ధీరశమ సోమ శరధీ
మార పరకమాన్యధన్య మాకరపరమా


మొదటిపాదంలో 9 అక్షరాలున్నాయి
శ్రీరత మహిమతరశ్రీ
అందులో నడిమి అక్షరం 5వది - హి
దాన్నుండి మళ్ళీ వెనక్కు
అవే అక్షరాలొచ్చేలా చేశాడు కవి

అలాగే రెండవపాదంలో  17 అక్షరాలున్నాయి.
సారసవనయ శహితాహి శయనవసరసా
వీటిలో మధ్యన ఉన్న అక్షరం 9వ అక్షరం - తా
దీనితరువాతనుండి అక్షరాలను వెనుకకు కూర్చాడు

3వపాదంలో మొత్తం అక్షరాలు 9
ధీరశమ సోమ శరధీ
అందులో 5వ అక్షరం సో
దాన్నుండి వెనుకకు కూర్చాడు

4వపాదంలో మొత్తం అక్షరాలు 15
మార పరకమాన్యన్య మాకరపరమా
అందులో మధ్యఅక్షరం 8వది -
దీన్నుండి వెనుకకు అక్షరాలను కూర్చాడు
దీనివల్ల ఇది పాదభ్రమకంగా మారుతున్నది.

శ్రీరత మహిమతరశ్రీ
సారసవనయ శహితాహి శయనవసరసా
ధీరశమ సోమ శరధీ
మార పరకమాన్యన్య మాకరపరమా

No comments: