Tuesday, December 13, 2016

ఏకాక్షర నిఘంటువు - 9


ఏకాక్షర నిఘంటువు - 9



సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........



- దాత, భేదించుట, ఓర్పు, దానము, పానము, వైరాగ్యము,
         భార్య, చూపు, మూగ, పట్టుబడినది, పరిశుద్ధుడు, దావకము,
         శుచి, శివుడు, గురుడు, త్రాగుట, పిలుపు.


దః - దయ, దానము, దమము, దాత ,దత్తము, ఖండనము,
            భార్య, ఆకాశము,ఖండనము, ఇచ్చుట.


దమ్  - భార్య, పుష్టి, వృద్ధులు, కలిగించు, సుందర బీజాక్షరము,
                 శాంతించుట, అడ్డగించుట, వశపరచుకొనుట.

దల్ - ముక్కలగుట, వికసించుట.


దా -  ఖండనము, రక్షణము, శోధనము,
            దళము, దానము, రోగము.

దామ్ - దత్తాత్రేయ బీజము.

దుర్ - అమంగళము, దుఃఖము.

దృక్ - దర్శనము, జ్ఞానము, నేత్రము, చూచువాడు.


దృశ్ - చూచు, వెదకు, నిశ్చయించు.


ద్యు   - దినము. ఆకాశము, ప్రకాశము,
                   స్వరము, అగ్ని.

ద్యుత్ - ప్రకాశించు, వెలుగు.



No comments: