ఏకాక్షర నిఘంటువు - 16
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
యః - కీర్తి, ప్రయాణము, వాయువు, త్యాగము, పోవువాడు,
స్థానము, యోగము, యముడు, దాత, మగణము.
యమ్ - సర్వవ్యాపకమగు ఒక పవిత్రబీజాక్షరము, వాయుబీజము,
వశ్యబీజము, వీరబీజము, యత్నము, యమున.
యజ్ - యాగముచేయుట, ఆహుతులిచ్చుట, పూజించుట.
యత్ - సర్వనామము, అవ్యయము, హేతువు, ప్రయత్నించుట.
యద్ - ఎవడు, ఎవతె, ఏది.
యన్త్ర్ - నిలువుట, అడ్డుకొను.
యా - కీర్తి, యానము, వాహనము, పూలగుత్తి, కాంతి, లక్ష్మి,
నిర్మాణము, ప్రాప్తి, త్యాగము, పోవుట.
యాచ్ - కోరుట, అడుగుట.
యు - కలియుట, వేరువేరుగా చేయుట.
యుజ్ - కలియుట, అనురక్తుడగుట, చేరుట, ప్రయోగించుట,
నియోగించుట, కలుపుట, కలిసినవాడు.
యుధ్ - పోరు(సంగ్రామము), యుద్ధము చేయుట,
సంఘర్ష మొనర్చు.
No comments:
Post a Comment