ఏకాక్షర నిఘంటువు - 10
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........
ధ - ఇంద్రుడు, ధ్వని, ధాన్యము, కుబేరుడు,
ధన్వంతరి, కడవ, గృహము, ధనము.
ధం - ధనము, ధనికుడు.
ధః - బ్రహ్మదేవుడు, మనువు
ధా / ధిః, / ధీః - బుద్ధి
ధిక్ - ధక్కారము, నింద.
ధూః - బరువు, ధనము, వణకుట,
కదలుట, కలతజెందుట.
ధ్మా - ఊదుట, నిస్వనించుట, నిప్పుమండునట్లుచేయుట.
న - వినాయకుడు, నాభి, జ్ఞానము, వాద్యము, గొడ్రాలు,
సూక్ష్మమైనది, మిగుల కష్టమైనది, శూన్యమైనది, భేదమైనది,
దానము, మేలు, అభావార్థము.
నః - అధిపతి, పడవ, బౌద్ధశాస్త్రవేత్త, బుద్ధుడు, స్తోత్రము,
వృక్షము, స్వాగతము, చుట్టము, చెట్టు, సూర్యుడు,
బంగారము, బంధము, రత్నము.
నా - మోడు, వరుడు, మగవాడు, నాయకుడు, నిషేధము.
ని - బెదిరించు, మత్సరము, వంగుట, మిక్కలి, స్వరము.
నిర్ - నిషేధము, నిశ్చయము.
నీ - తీసుకొని పోవుట, తెచ్చుట, చేర్చుట.
ను - నుతి
నుద్ - ప్రేరణ, ప్రోత్సహించుట, తొలగించుట.
నౌః - ఓడ, కాలము, నవ్వు
No comments:
Post a Comment