ఏకాక్షర నిఘంటువు - 7
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి.....
ట - భూమి వడగండ్లు, ధ్వని, తలుపు, విల్లు, పొగ, కాకి,
సూర్యకిరణం, నీటిసుడి, పుత్రుడు, ఉత్పత్తి, ఆవృత్తి,
చమరీమృగము, పలుమార్లు పలకడం.
టః -కొట్టునట్టివాడు, పాదము, ధ్వని
టం - టంకారము, సర్వవ్యాధి హరబీజము,
షణ్ముఖ బీజము, స్వనబీజము.
టా - భూమి.
ఠ - పిల్లన గ్రోవి, ధ్వని, కట్టుట, దృఢము, అగ్ని
ఠః - శివుడు, ఠమ్మను చప్పుడు, చంద్రమండలము, విషయము,
బిందువు, సాహసము, జనులగుంపు, మూర్ఖుడు, శూన్యము.
ఠమ్ - చంద్రబీజము, ధ్వనిబీజము, పద్మబీజము.
డ - దేశము, శంభుడు, చిఱునగవు, భయము, నాశము,
జయధ్వని, శంఖధ్వని, రౌద్రరసము, సిగ్గు, వాక్కు,
డామరవాద్యము, దుర్గమ స్థలము, వస్త్రము,
డమరుకవాద్యము, ఆందోళనము, గాయకుడు, జడుడు.
డమ్ - విషహరమగు ఒక బీజము, గరుడ బీజము,
రేణుకా బీజము, అంజనీబీజము, అందలము,
గాయకుడు.
డా - డాకిని.
ఢ - పిశాచము, భయము, కాలము, ప్రేమ, మార్గస్థుడు,
ధ్వని, జయభేరి, పోలిక, జ్ఞానము, వాద్యము, గుణహీనుడు,
దాగినవాడు, సాధువు, ఎడమ కుడి పిక్కలు, కొడుకు.
ఢః - ఢక్క, కుక్క, కుక్కతోక, ధ్వని, నిర్గుణము.
ఢమ్ - సకల సంపత్ప్రదమగు ఒక బీజము,
వాయుబీజము, బాణ బీజము.
ణ - జారుడు, భయంకరుడు, కంటకము,
ధ్వని, గగుర్పాటు, శూరుడు, కాపాడుట, ముల్లు.
ణః - వరహము, నగ, సత్యము, చలిపందిరి, బిందుదేవుడు,
గుణరహితుడు, నిర్ణయము,
ణా - గోవు,రాత్రి, పాన్పు, ముక్కు,
దయ, తామరరేకు, జ్ఞానము
ణ్యః / ణ్యం - బ్రహ్మలోకమునందలి ఒక పెద్ద సరస్సు.
No comments:
Post a Comment